తెలంగాణ

జలాశయాల నుంచి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: జాతీయ జల విధానంలో భాగంగా తాగునీటి పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జలాశయాల్లో కనీస నీటి మట్టాలను నిర్థారించాలని సాగునీటి అధికారులను ఆయన సోమవారం ఆదేశించారు. మిషన్ భగీరథకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 2017 నాటికి తాగునీటి సరఫరా ప్రారంభం కావలసి ఉన్నందున జలాశాల్లో కనీస నీటి మట్టాలను పాటించాలని చెప్పారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో యెల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలు కీలక బ్యాలెన్సింగ్ జలాశయాలు కనుక గోదావరి నీటిని ఈ జలాశయాల్లోకి నింపగలిగితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా వందలాది గ్రామాలకు, పట్టణాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని మంత్రి చెప్పారు. ఈ దిశగా తాగునీటి పథకాల అధికారులు, తాగునీటి శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
తాగునీటి పథకాలను అమలు చేస్తున్న వివిధ సంస్థల అధికారులతో మంత్రి జలసౌధలో సోమవారం సమావేశం అయ్యారు.వివిధ జలాశయాలపై అధారపడిన ఈ తాగునీటి పథకాల అమలు పై అధికారులను వివరాలు అడిగారు. నాగార్జున సాగర్ జలాశయంలోకి, సింగూరు జలాశయం, గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల్లోకి నీరు తగినంతగా రాకపోవడంతో గత కోటి జనాభా కలిగిన హైదరాబాద్ నగరానికి గత మూడేళ్లుగా తాగునీటికి సమస్య ఏర్పడుతోందని చెప్పారు. గత ఏడాది యెల్లంపల్లి జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నింపడం వల్ల హైదరాబాద్ తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా సాగిందని, లేక పోతే హైదరాబాద్ తీవ్రమైన తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చేదని అన్నారు. మొదటి దశలో యెల్లంపల్లి నుంచి 10 టిఎంసిల నీటిని తరలించడానికి పనులు పూర్తయ్యాయని , మరో 20 టిఎంసిల నీటిని నిల్వ చేయడానికి కేశవపురం వద్ద జలాశయం ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం అయిందని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారని తెలిపారు. యెల్లంపల్లి జలాశం నుంచి నాలుగు టిఎంసిలు, మిడ్‌మానేరు, దిగువ మానేరు నుంచి తొమ్మిది టిఎంసిలు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. ఇటీవల ప్రభుత్వం తాగునీటి అవసరాలను పెంచుతూ జివో జారీ చేసిందని చెప్పారు. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరి ఖని తదితర పట్టణాలకు తాగునీటి సరఫరా జరగాలంటే యెల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలే కీలకమని ఇంజనీర్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో ద్వారా సరఫరా, మిషన్ భగీరథ పథకాల ద్వారా తాగునీటి సరఫరా సమర్థవంతంగా జరగాలంటే యెల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాల్లో ఎప్పుడూ తగినంత నీరు నిల్వ ఉండేలా చూడాలని , జలాశయాల కనీస నీటి మట్టాలను నిర్థారించాలని సాగునీటి అధికారులకు చెప్పారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు