తెలంగాణ

కీలక సమాచారం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు సోమవారం యువ నటుడు తనీష్ హాజరయ్యాడు. డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్‌తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్‌కు నోటీసులు జారీ చేశామని, ఈ మేరకు ఆయనను నాలుగు గంటలపాటు విచారణ జరిపినట్టు సిట్ అధికారులు తెలిపారు. తనీష్‌తోపాటు ముగ్గురిని విచారించినట్టు సిట్ అధికారులు తెలిపారు. నాలుగు గంటలపాటు సాగిన దర్యాప్తులో తనీష్ నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. కెల్విన్ కాల్‌డేటాలో తనీష్ పేరు ఉందని సిట్ అధికారులు గుర్తించారు. దాదాపు వందకుపైగా వాట్సాప్ మెస్సేజ్‌లు తనీష్ నుంచి కెల్విన్‌కు వెళ్లినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. కెల్విన్‌తో నేరుగా సంబంధాలున్నాయని కూడా తనీష్‌పై ఆరోపణలున్నాయి. అందుకు తగిన ఆధారాలు కూడా సిట్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది.
కాగా ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎక్సైజ్ సిట్ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తులో ఇంకా కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో రెండో జాబితాను సిట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు తొమ్మిది మందిని విచారించిన సిట్ అధికారులు సోమవారంతో సినీ ప్రముఖుల సంఖ్య పదికి చేరింది. మంగళ, బుధవారాలలో జరిగే విచారణతో తొలి దఫాగా చేపట్టిన సినీ ప్రముఖుల విచారణ పూర్తవుతోంది. సినీ ప్రముఖుల దర్యాప్తు చివరి దశకు చేరడంతో సిట్ అధికారులు రెండో జాబితాపైనే దృష్టి సారించారు. నేడో, రేపో రెండో జాబితాలోవున్న వారందరికీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. తనీష్ దర్యాప్తులో కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు మరికొంత మంది సినీ పరిశ్రమకు చెందిన వారిని విచారించనున్నట్టు తెలిసింది. అయితే వీరికి అందే నోటీసులు గోప్యంగా ఉంటాయని తెలుస్తోంది.
నేడు సిట్ ముందుకు నందు
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులను విచారిస్తున్న ఎక్సైజ్ సిట్ బృందం మంగళవారం మరో యువ నటుడు నందును విచారించనుంది. మాదకద్రవ్యాల వినియోగంపై అభియోగాలు ఎదుర్కొంటున్న నందు నాంపల్లిలోని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి రానున్నారు. ఈ విచారణలో సిట్ అధికారులు కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ సరఫరా, ఎవరెవరితో దందా.. అనే ప్రశ్నలు ప్రధానంగా వేయనున్నట్టు తెలిసింది.

చిత్రం.. సోమవారం విచారణ కోసం సిట్ కార్యాలయానికి తరలివస్తున్న నటుడు తనీష్