తెలంగాణ

ఇసుక దందాల చరిత్ర మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని తెరాస నాయకుడు, టిఎస్‌ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దళితుల పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదని, ఇసుక క్వారీల విషయంలో కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా కోట్ల రూపాయలు దోచుకుందని, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా టెండర్లు పిలిచి పరిస్థితిని చక్కదిద్దిందని చెప్పారు. 2006 నుంచి 2014 వరకు ఎనిమిదేళ్లలో ఇసుక మీద కేవలం రూ.38 కోట్ల ఆదాయాన్ని చూపించారని, కానీ తెరాస ప్రభుత్వం ఒక్క 2015-16 లోనే రూ.375 కోట్ల ఆదాయాన్ని రాబట్టిందని శంకర్‌రెడ్డి తెలిపారు.