తెలంగాణ

‘ఉపాధి హామీ’ కోసం జిల్లాకో అంబుడ్స్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజినరేగా) పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో ‘అంబుడ్స్‌మన్’ను నియమించాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు, ఎంజినరేగా నియమావళికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబుడ్స్‌మన్‌లను ఎంపిక చేసేందుకు రాష్టస్థ్రాయిలో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే ఒక అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఈ కమిటీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధి, కేంద్రం నియమించే ఒక సచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. నోడల్ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఈ కమిటీ జిల్లాల్లో అంబుడ్స్‌మన్‌లను నియమిస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించి అంబుడ్స్‌మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.