తెలంగాణ

వినియోగదారుడికి కోరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: దేశంలో వినియోగదారుల చట్టంలో సమూల మార్పులు రానున్నాయి. ఇంత కాలం దేశంలో నిస్తేజంగా ఉన్న చట్టాలకు కేంద్రప్రభుత్వం కోరలు ఇవ్వనుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రస్తుత సమావేశాల్లోనే వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పులకు పార్లమెంటు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బిల్లులోని అంశాలను కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 1986లో రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టం స్వరూపమే దీంతో మారిపోతుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుల ఫోరంల స్థానంలో కమిషన్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పూర్తి అధికారాలున్న కమిషన్లు ప్రారంభం అవుతాయి. వీటికి తోడు వినియోగదారుల రక్షణ సంస్థలు కూడా ఏర్పాటు అవుతాయి. వినియోగదారులు ఇచ్చే అన్ని ఫిర్యాదులను ఈ సంస్థ దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుకల్పిస్తారు. వస్తువులు, సేవల రంగంలో భద్రత రక్షణ చర్యలను చేపట్టడంతో పాటు అందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుంది. వస్తువుల నాణ్యత, ప్రమాణాల్లో తేడా ఉంటే ఆయా వినియోగదారులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించి పరిహారం చెల్లించమని ఆదేశించే ప్రత్యేక అధికారాలు కూడా ఈ సంస్థకు దక్కుతాయి. అవసరానికి మించి అదనపు సెక్యూరిటీ చెల్లించమని కోరడం, ఉల్లంఘనల విషయంలో అనుచితమైన జరిమానాలు, ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు, వినియోగదారులను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడం వంటి అంశాలను కూడా ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. కేంద్రం ఈ చట్టం అమలులోకి తీసుకురాగానే అన్ని రాష్ట్రాలు దీనిని నిర్బంధంగా అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే సమస్యల పరిష్కారానికి అవసరమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏర్పాటవుతాయి.