తెలంగాణ

‘బిసిలు ఆత్మగౌరవంతో బతికేందుకు పథకాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: బిసి వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలో శాలివాహన సంఘ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసిలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా పథకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రాజకీయంగా, సామాజికంగా బిసిలు ఎదగాలని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల వృత్తులతోనే ఆధారపడి ఉందని చెప్పారు. కుల వృత్తుల్లో అత్యాధునిక యంత్రాల వినియోగానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. పాత పద్దతులను ఆచరించడం మానుకోవాలని , మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. మానవ జీవితానికి కుమ్మరి వర్గాల ఉత్పత్తులు ముడిపడి ఉన్నాయని చెప్పారు. మనిషి జననం, మరణం, పెళ్లితో సహా అన్నింటిలో కుమ్మరి వర్గాల మట్టి ఉత్పత్తుల అవసరం విధగా ఉందని అన్నారు. కుమ్మరి వర్గాలు ఆధునిక పద్దతుల్లో వ్యాపారం చేసుకునేందుకు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దీని కోసం రాజస్తాన్, గుజరాత్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమాలు పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను త్వరలో పంపించనున్నట్టు చెప్పారు.

చిత్రం.. మంగళవారం సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి జోగురామన్న