తెలంగాణ

మేకిన్ తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణలో తెలంగాణలో ఎల్‌ఇడి బల్బులు కాంతులు విరజిమ్మాయి. ఐటీ పాలసీ ఆవిష్కరణలో ఐటీతోపాటు ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జెయేష్ రంజన్ వివర్తి, తెలంగాణ గడ్డమీద తయారైన ఎల్‌ఇడి దీపాలు రాష్ట్ర చిత్రపటాన్ని ఆవిష్కరిస్తాయని ప్రకటించారు. ఎల్‌ఇడి దీపాల కాంతులతో తెలంగాణ చిత్రపటం, అందులో జిల్లాలతో సహా చిత్ర పటం ఆవిష్కృతం అయింది. అలాగే స్ధానికంగా తయారైన రొబోలు మరో ప్రధాన ఆకర్షనీయంగా నిలిచింది. ఆర్‌ఆర్‌డిఎల్ కంపెనీలో రూపొందించిన టి-1,టి-2 రొబోలు రెండు వేదికపై ప్రదర్శించగా, అందులో ఒక రొబో నెమ్మదిగా ముందుకు కదులుతూ వచ్చి ఐటీ పాలసీ పత్రాలను పల్లెంలో పెట్టి ముఖ్యమంత్రికి అందించే దృశ్యం ఆహుతులను కనువిందుల్ని చేసింది.

రోబోను పరిశీలిస్తున్న సిఎం కెసిఆర్