తెలంగాణ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో త్వరలో సొంత బ్యాండ్‌విడ్త్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్‌ఆర్‌ఓ)కు త్వరలో సొంత బ్యాండ్‌విడ్త్‌ను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సమయంలో తలెత్తే తప్పిదాలు, సర్వర్ చాలా సార్లు మొరాయించడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సొంత బ్యాండ్‌విడ్త్‌ను ఏర్పాటు చేసుకోబోతోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నల్గొండ, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి ఎస్‌ఆర్‌ఓల్లో ప్రభుత్వం సొంత బ్యాండ్‌విడ్త్‌ను వినియోగించి సేవలందిస్తోంది. టెలికమ్యూనికేషన్స్‌లోనే అత్యధిక సామర్ధ్యంతో పని చేసే హై స్పీడ్ డేటాను అందించే మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విట్చింగ్ (ఎంపిఎల్‌ఎస్) నెట్‌వర్క్ ద్వారా రైల్‌టెల్ అనే సంస్థతో రిజిష్ట్రేషన్ల శాఖ ఒప్పం దం చేసుకుంది. దీని ద్వారా శరవేగంగా ఇంటర్‌నెట్ కనెక్టివిటీకి సొంత బ్యాండ్‌విడ్త్ దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి అన్ని ఎస్‌ఆర్‌ఓల్లో ఈ సొంత నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు రిజిష్ట్రేషన్ల శాఖ సొంత వెబ్‌సైట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసేందుకు నిర్ణయించింది. ప్రతి రోజు వేలాది మంది రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల నెమ్మదిగా పనిచేయడం, డేటా నిల్వ ఉంచేందుకు సరిపడా సామర్ధ్యం ఉండక ఇబ్బందిని ఎదుర్కొంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ సొంత వెబ్‌సైట్‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తోంది. గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ కావడం, ఆరేళ్ల నుంచి పని చేస్తున్నందున డేటా స్టోరేజ్ అవసరానికి వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం భావించింది. వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేయడం ద్వారా సొంత బ్యాండ్‌విడ్త్‌కు అనుసంధానం అవుతుంది. ఇందుకోసం ఒక సర్వీస్ ప్రొవైడర్‌తో బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్దతిలో నిర్వహించేందుకు రూ.75 కోట్ల వ్యయంతో ఐదేళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ మరో నిర్ణయం కూడా తీసుకుంది. అన్ని ఎస్‌ఆర్వోల్లో కొత్త పర్సనల్ కంప్యూటర్లు, ఐరిస్ గుర్తింపు పరికరాలు, బయోమెట్రిక్, వేలిముద్రల నమోదు, డిజిటల్ కెమెరాలు, లాన్ నెట్‌వర్క్స్, ప్రింటర్స్, స్కానర్స్, యుపిఎస్, సిసిటివి కెమెరాలు, రూటర్స్, సర్వర్లను ఆధునాతన టెక్నాలజీకి సరిపడా కొనుగోలు చేస్తోంది. దీంతో సంపూర్ణ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ శాఖ పని చేసేందుకు ముందుకెళుతోంది. ఈ కొత్త చర్యలతో నెట్‌వర్క్ సమస్య, సాఫ్ట్‌వేర్ లోపం, సర్వర్ డౌన్ అవడం వంటి సమస్యలను అధిగమించడంతో పాటు రిజిష్ట్రేషన్ల నమోదులో అవకతవకలకు చెక్ పెట్టేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.