తెలంగాణ

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మేందుకు నిర్ణయించినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా ఫ్లాట్లను విక్రయించనున్నట్లు వెల్లడించారు. మొదటి దశగా బండ్లగూడ, పోచారంలో నిర్మించిన 3,719 ప్లాట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. పారదర్శకంగా ఇళ్లను విక్రయించేందుకు త్వరలోనే ఆన్‌లైన్ ప్రక్రియ కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీని కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక దరఖాస్తును అభివృద్ధి చేసిందని తెలిపారు. మార్కెట్‌ను అంచనా వేయకుండా గత ప్రభుత్వాలు గుడ్డిగా ఈ ప్రాజెక్టును చేపట్టాయని అన్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అన్ని వౌలిక వసతులతో కూడిన ప్లాట్లను నిర్మించిందని, వీటిని కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలని మంత్రి తెలిపారు. విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొన్నారు. మొదటి దశలో బండ్లగూడలో ఉన్న 2245 ప్లాట్లను, పోచారంలో ఉన్న 1474 ఫ్లాట్లను రాజీవ్ స్వగృహ విక్రయించనుందని తెలిపారు. బండ్లగూడలో 316 గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని, పోచారంలో మొత్తం 1474 ప్లాట్లకు గాను 969 ప్లాట్లలో పనులు పూర్తి కాగా, 505 ప్లాట్లకు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని అన్నారు. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన వాటికి చదరపు అడుగుకు రూ.1900గా, సెమీ ఫినిష్డ్ ప్లాట్లకు రూ.1700 గా ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.