తెలంగాణ

రైల్వే స్టేషన్లలో భారీగా గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసు విచారణ నేపథ్యంలో రైల్వే శాఖ నిఘా పెంచింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా రైళ్లలో మాదకద్రవ్యాలను తరలిస్తుందని డ్రగ్స్ రవాణాపై దృష్టిసారించాలని డిజిపి (రైల్వే, రోడ్డు భద్రత) టి కృష్ణప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇటీవల రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టింది. రైల్వే స్టేషన్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డిజిపి (రైల్వే) కృష్ణప్రసాద్ తెలిపారు. గురువారం రైల్వే ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్, డిఎస్పీ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, వికారాబాద్, సికిందరాబాద్, వరంగల్, కాజీపేట్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 307 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశామని, నిందితులు కోణార్క్, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో ముంబయి, ఢిల్లీకి గంజాయిని చేరవేస్తున్నట్టు తెలిపారు. రూ. 30.35 లక్షలు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

చిత్రం.. గంజాయి పట్టివేత వివరాలు వెల్లడిస్తున్న పోలీస్ అధికారులు