తెలంగాణ

వర్షాభావంతో రైతాంగం విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితితో రైతులు విలవిలలాడుతున్నారు. జూన్‌లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ (పాతవి) జిల్లాల్లో 20 నుండి 30 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిశాయి. జూన్ రెండోపక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చే వర్షాలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. కురిసిన వర్షాలపై ఆధారపడి దాదాపు 69 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న సజ్జ, ఆముదం, కందులు, వేరుసెనగ తదితర పంటలను రైతులు వేశారు. గత వారం, పదిరోజుల నుండి చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో భూమిలో తడిఆరిపోయి వేసిన జొన్న, సజ్జ తదితర పంటలు ఎండిపోయే దశకు చేరాయి. మరో నాలుగైదు రోజుల్లో అవసరమైన వర్షాలు కురవకపోతే ఈ పంటలు పూర్తిగా ఎండిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని జిల్లాల నుండి సమాచారం అందింది. వర్షాభావ పరిస్థితి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, ఈ స్థితి ఆంధ్రప్రదేశ్, తమళనాడు, పాండిచ్చెరి, విదర్భ, మరాట్వాడా, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, ఉత్తర కర్నాటక తదితర ప్రాంతాల్లో కూడా నెలకొని ఉందని ఐఎండి ప్రకటించింది. మరో నాలుగు రోజుల వరకు ఈ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతీ రుతుపవనాలు బలంగా ఉండాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, వాయుగుండం, తుపాను (ఏదో ఒకటి) ఏర్పడాల్సి ఉంటుందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ కె. నాగరత్న తెలిపారు. గురువారం ఆంధ్రభూమి ప్రతినిధితోమాట్లాడుతూ, మరో వారం పదిరోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు. పదిరోజుల్లోగా మళ్లీ మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. రుతుపవనాల ద్రోణి హిమాలయాలవైపు వెళ్లిందని, దాంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నాయని ఐఎండి భారతీయ శాస్తవ్రేత్త ఒకరు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డప్పటికీ, దాని ప్రభావం భారత్ ఈశాన్య రాష్ట్రాలపైనే ఉంది.
వేచి ఉన్న వ్యవసాయ శాఖ
ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు వేసిన పంటలు, వర్షాభావం, తద్వారా ఏర్పడ్డ పరిస్థితిపై నివేదికలు పంపించాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లాల్లోని తమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు, మూడురోజుల్లో ఈ వివరాలు రావచ్చని ఈ శాఖ అధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో గురువారం తెలిపారు.