తెలంగాణ

కెసిఆర్ మూడేళ్ల పాలన ప్రజల్లో విశ్వాసం నింపింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: మూడేళ్ల కెసిఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నింపిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు మాట్లాడారు. ఏ ఒక్క పార్టీ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ రాష్ట్రం రాలేదని, బరిగీసి కొట్లాడితే తెలంగాం వచ్చిందని అన్నారు. తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడామో , అభివృద్ధి కోసం అదే విధంగా తపిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాళ్లకు కట్టెలు అడ్డుపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. ఎంతగా అభివృద్ధిని అడ్డుకున్నా మా సంకల్పాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మిడ్ మానేరును మూడేళ్లలో పూర్తి చెస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కనీసం 30 శాతం పనులు కూడా చేయలేదని అన్నారు. ఉద్యమం చేయడం తెలుసు, తెలంగాణ సాధించిన తరువాత పాలించడం తెలుసు అని ఆనాడే చెప్పామని, ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ నాయకుల్లా భూములు ఆక్రమించుకోవడం, కుంభకోణాలు మాకు తెలియదని అన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల్లా తామేమీ కొట్టుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వేగాన్ని చూసి ఇక తమకు అధికారం రాదు అని గమనించిన కాంగ్రెస్ నాయకులు కేసులు పెడుతూ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 45ఏళ్లపాటు ఏలిన వారు ప్రజల కనీస అవసరాలు తీర్చలేదని, ప్రాజెక్టులు కడతామని చెప్పి నిధులు స్వాహా చేశారు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనా విధానం దేశమంతా తెలుసునని, దేశంలో అన్ని చోట్ల ఓటమి తప్పడం లేదని అన్నారు. అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే కెసిఆర్ విపక్షాలను విమర్శించారని పల్లా రాజేశ్వర్‌రెడ్డితెలిపారు.