తెలంగాణ

కెసిఆర్ ఓ అబద్ధాల కోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: సిఎం కెసిఆర్ ఓ అబద్దాల కోరు, ఒక మాటకు మాట పొంతన ఉండదు, రాత్రి మాట్లాడింది పొద్దున ఉండదు అంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే కెసిఆర్ ప్రేలాపనలకు దిగారన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ పట్ల కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. తెలంగాణ ఆవిర్భావంలోకీలక పాత్రవహించిన మహిళానేత, అప్పటి స్పీకర్ మీరాకుమార్ పట్ల మాట్లాడాల్సిన విధానం ఇదేనా అన్నారు.ప్రజలకు అందుబాటులోలేని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వారు కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై తమ పార్టీ వారెవరూ పిటిషన్ వేయలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాకు కెసిఆర్ తగరన్నారు. సీమాంధ్ర కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు కెసిఆర్ పనిచేస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఖజానా దివాళాకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం జవాబుదారీ వహించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుకాదన్నారు. సిఎల్‌పి నేత జానారెడ్డి మాట్లాడుతూ, కోర్టుకు కాంగ్రెస్ పార్టీ వెళుతోందని, ఉద్యోగుల క్రమబద్ధీకరణను అడుకుంటోందని, అనేక ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అడ్డంకిగా ఉందన్న అభియోగాల్లో నిజం లేదన్నారు. తమ అసమర్ధతతను కాంగ్రెస్‌పై నెట్టి తప్పించుకుందామని చూస్తున్నారన్నారు. కడుపు మండిన వాళ్లు కోర్టుకు వెళితే కాంగ్రెస్‌కు ఏమి సంబంధం అన్నారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబాలు ఏమయ్యాయి, హైదరాబాద్ చుట్టు ఉన్న భూ ఆక్రమణ దారుల భరతం పడతామన్న ప్రగల్భాలు ఏమయ్యాయని సిఎంను ప్రశ్నించారు.
సిఎం హోదాను దిగజార్చారు
సిఎంకు ఉండాల్సిన హోదాను దిగజార్చి, తెలంగాణ యాసకు, భాషకు, సంస్కృతికి అపఖ్యాతి తెచ్చేలా కెసిఆర్ మాట్లాడారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సిఎం సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం ఇచ్చే ధైర్యం తెచ్చుకోవాలి తప్ప వ్యక్తిగత దాడులు రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనమని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ కెసిఆర్ సిఎం అన్న సంగతి మర్చిపోయి మాట్లాడి తెలంగాణ సమాజాన్ని అవమానపర్చవద్దని అన్నారు. కొడుకును కాపాడుకునేందుకే మీరు పాట్లుపడుతున్నారన్న సంగతి తెలుస్తోందని అన్నారు. మీడియా సాక్షిగా సిఎం కెసిఆర్ అబద్దాలు ఆడడం సరికాదని సిఐటియు పేర్కొంది. ట్రేడ్ యూనియన్లపై అసహనంగా మాట్లాడ్డం సిఎం హోదాకు తగదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి చుక్క రాములు, ఎం.సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సిఎం వ్యాఖ్యలకు నిరసనగా 4న కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.

చిత్రం.. గురువారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి నేత ఉత్తమ్, పొన్నాల