తెలంగాణ

విక్రమ్‌గౌడ్ డిశ్చార్జ్..వెంటనే అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్ నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం కాల్పుల హైడ్రామా ఆడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం విక్రమ్‌గౌడ్ డిశ్చార్జ్ అయి వీల్‌చైర్‌పై ఉండగా వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల ఘటనలో బుధవారం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా విక్రమ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనతోపాటు ఐదుగురు నిందితులను గురువారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం విక్రమ్‌గౌడ్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే విక్రమ్‌గౌడ్ గాయపడి చికిత్స పొందుతున్న దృష్ట్యా మరికొన్ని రోజులు చికిత్స అవసరమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
దీంతో విక్రమ్‌గౌడ్ చికిత్సకు అనుమతిస్తూ, ఉస్మానియా, లేదా..గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోర్టు జైళ్లశాఖను ఆదేశించింది. ఇదిలావుండగా పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు, అక్రమ ఆయుధాన్ని కల్గి, ఉపయోగించిన ఘటనలో ఎనిమిది మందిపై ఎఫ్‌ఆర్‌ఐ దాఖలైంది. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్న విక్రమ్‌గౌడ్‌తో సహా ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వెంకటరమణ, గౌస్‌ల కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
విక్రమ్‌గౌడ్ మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడే కాదు. తెలివితేటలు తండ్రిని మించినవే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరిక ఆయనది. విజయానికి ప్రజల ఆదరణ కావాలి. తనపై హత్యాయత్నం జరిగిందని, కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చేరితే..బంధువులు, సన్నిహితులు దగ్గరవుతారని భావించాడు. దీనికి తోడు మైనింగ్ వ్యాపారంలో నష్టం, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ల ఒత్తిడి నుంచి బయటపడాలి. ఇందుకు ఆయనకు సూపర్ ఆలోచన వచ్చేసింది. ‘అతడు’ సినిమాలో రాజకీయ నాయకుడు శివారెడ్డి ప్రజల్లో సానుభూతి కోసం తనపై కాల్పులు జరిపేందుకు కిరాయి హంతకులకు సుపారి ఇచ్చిన సన్నివేశాన్ని ఫాల్లో అయ్యాడు. దానికి అవసరమైన స్క్రీన్‌ప్లేనూ సిద్ధం చేసుకున్నాడు. తనపై కాల్పులకు హంతక ముఠాతో సుపారి కుదుర్చుకున్నాడు. ప్రాణాపాయం లేకుండా ఎక్కడ కాల్పులు జరపాలో.. ఎక్కడ జరిగితే సురక్షితంగా బయటపడతానో..సెట్ చేసుకుని అదే ప్రదేశాల్లో కాల్పులు జరిగేలా జాగ్రత్తలు తీసుకుని ఆసుపత్రి పాలయ్యాడు. కానీ పోలీసులకు సరైన విధంగా కథ వినిపించటంలో మాత్రం ప్లాప్ అయ్యాడు. ఫలితం.. కేసులు.. అరెస్టులు.. రిమాండ్.

చిత్రం.. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయన విక్రంగౌడ్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు