తెలంగాణ

దేశంలో బిజెపికి ఎదురులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 6: దేశంలో బిజెపికి ఎదురులేదని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఇప్పటికే 18 రాష్ట్రాల్లో పాగా వేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున యువకులు బిజెపిలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గజ్వేల్ నుండే టిఆర్‌ఎస్ పతనం ప్రారంభం కాగా, యూపి తరహాలో తెలంగాణలో అధికారం కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, టిఆర్‌ఎస్ తదితర పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధం ఉండగా, చాయ అమ్మిన నరేంద్రమోదీని ప్రధానిగా, దళిత వర్గాల నుండి పైకి వచ్చిన రాంనాధ్ కోవిందును రాష్టప్రతిగా, రైతు కుటుంబం నుండి వచ్చిన వెంకయ్యను ఉపరాష్టప్రతిగా చేసిన ఘనత బిజెపికే సాధ్యపడిందని తెలిపారు.
12 శాతం ముస్లిం రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధమని తెలిసినప్పటికీ తెలంగాం సిఎం కెసిఆర్ వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండడం సిగ్గుచేటు కాగా, ముస్లింలను బిసిలో చేర్చి వారిని నష్ట పరిచే చర్యలు ఎంతమాత్రం తగదని నిలదీశారు. రాష్ట్రంలో గత 3 యేండ్ల వ్యవధిలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారికి రూ. 6 లక్షల పరిహారం అందించడంలో విఫలం చెందారని ఆరోపించారు. మతతత్వ మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే సత్తా బిజెపికే ఉండగా, టిఆర్‌ఎస్ సర్కార్ స్టీరింగ్ తామేనని ఓవైసీ సోదరులు పేర్కొంటున్నప్పటికీ కెసిఆర్ వారికి మోకరిల్లుతుండడం దురదృష్టకరమని నిలదీశారు. రూ. లక్ష కోట్ల అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ కథ ముగిసినట్లేనని, ప్రపంచంలోనే ప్రజాకర్షణ నేతగా నరేంద్రమోదీ అన్ని వర్గాల మెప్పు పొందుతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ఉద్యానవన యూనివర్సిటీ, రైల్వేలైన్‌ను మంజూ రు చేయడంతోపాటు 106 పథకాలను వర్తింపజేస్తుండగా, కేంద్ర నిదులను పక్కదారి పట్టిస్తున్న టిఆర్‌ఎస్ సర్కార్ చర్యలను బిజెపి ఎండగట్టే క్రమంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 3 రోజులు పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

చిత్రం.. గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్