తెలంగాణ

మెడిసిన్ కోర్సు ఫీజులపై పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ మెడికల్ సీట్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. మెడికల్ సీట్ల అడ్మిషన్లపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మైనార్టీ, బి కేటగిరి, సి కేటగిరి మెడికల్ సీట్ల ఫీజులను కావాలనే మార్చారని హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను విచారించింది. సంవత్సరానికి 11 లక్షల నుండి 14 లక్షల రూపాయిలకు ఫీజు పెంచిన ప్రభుత్వం దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటీషనర్ హైకోర్టుకు తెలిపారు. గతంలో జారీ చేసిన జీవో 130 ప్రకారం 60: 40 శాతం కింద సీట్లను భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిందని దానిని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఫీజులను పెంచిందని అన్నారు మైనార్టీ మెడికల్ కాలేజీల్లో కూడా 60: 40 శాతం నిష్పత్తి కింద సీట్లను భర్తీ చేయాలని పిటీషనర్ కోరారు. పిటీషనర్ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 115,117,119 జీవోలపై స్టే విధించింది.