తెలంగాణ

ఉప రాష్టప్రతి పదవికి వనె్నతెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: ఉప రాష్టప్రతి పదవికి వనె్నతెస్తానని ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు ఉపన్యాసాలు, రచనలు, పార్లమెంటు ప్రసంగాలతో కూడిన ‘అలుపెరగని గళం- విరామమెరుగుని పయనం ’ గ్రంథాల ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం-రాష్ట్రాలు కలిసి పనిచేయాలి, అపుడే దేశం శక్తివంతంగా మారుతుందని , ఈ దేశానికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో తనకు ముందు వెనుక ఎవరూ లేరని, రిక్షాలో కూర్చుని ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు మైక్ పట్టుకుని ప్రచారం చేసే స్థాయి నుండి ఉప రాష్టప్రతి స్థాయికి ఎదిగానని, దానికి కారణం పార్టీ ఇచ్చిన ప్రోత్సాహమేనని అన్నారు. తనకు ఎలాంటి నేపథ్యం లేదని, లగ్జరీ లేదని, నమ్మిన సిద్ధాంతానికి తాను కట్టుబడి ఉన్నానని, కష్టపడితే ఎ స్థాయికి అయినా ఎదగవచ్చని అన్నారు. లాంతరు కూడా లేని గ్రామాల్లో వీధి బడిలో చదువుకున్నానని, పార్టీ తనను అమ్మలాగ ప్రోత్సహించిందని చెప్పారు. రాజకీయాల్లో సాష్టాంగ దండప్రమాణాలు చేయడం ఒక జబ్బుగా తాను పరిగణిస్తానని, ఎన్నడూ ఎక్కడా ఎవరికీ తాను సాష్టాంగ దండ ప్రమాణాలు చేయలేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశంలో అర్ధవంతమైన ఎన్నికల సంస్కరణలు రావాలని, ప్రజలందరికీ అభివృద్ధి వౌలిక దృష్టి కావాలని, పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగించడం, సమాన అవకాశాలు , అక్రమాలను అరికట్టడంపై పోరుసాగాలని, అలాగే నిర్మాణాత్మక వైఖరిని పత్రికలు అలవరుచుకోవాలని సూచించారు. రాజకీయాల్లో వారసత్వం మంచిది కాదని, కుటుంబ సభ్యులను ప్రోత్సహించరాదని, మంచివాళ్లను ప్రోత్సహించాలని వెంకయ్యనాయుడు చెప్పారు. తాను రాజకీయ జీవితంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేని రీతిలో వ్యవహరించానని, కుటుంబ సభ్యులను ఇందులోకి లాగలేదని, వారి వ్యవహారాల్లో తాను తలదూర్చలేదని పేర్కొన్నారు. ప్రతి విజయం జీవితంలో ఉన్నతస్థాయికి సోపానంగా మలుచుకున్నానని, కేంద్ర మంత్రి పదవిని స్వచ్ఛందంగా వదులుకుని పార్టీ కోసం పనిచేశానని అన్నారు. అంతకు ముందు అలుపెరుగని గళం- విరామమెరుగని పయనం గ్రంథాలను ఈనాడు అధినేత రామోజీరావు ఆవిష్కరించి తొలి ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారికి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్‌కు, రాజకీయ విశే్లషకుడు ఎన్ గురుమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ వెంకయ్య ఉపన్యాసాలు రాజనీతి శాస్త్ర విద్యార్ధులకు గొప్ప పాఠాలు అవుతాయని అన్నారు. స్పీకర్ ఎస్ మధుసూధనాచారి మాట్లాడుతూ భాషతో సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని పేర్కొన్నారు. స్వీయప్రతిభతో ఎదిగారని అన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు సత్ప్రమాణాలను వెంకయ్య చూపించారని అన్నారు. అంతకుముందు ఎంఎస్ సుబ్బులక్ష్మి గీతాలను శివప్రసాద్ ఈల పాటగా పాడి రూపొందించిన సిడిని వెంకయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో వెంకయ్య తన సహాయకుడు సత్యకుమార్‌ను, ఎ కృష్ణారావును, డాక్టర్ చంద్రశేఖరరెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా, కామినేని, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, చింతల, ఇంద్రసేనారెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ డిజిపి దినేష్‌రెడ్డి, క్యాన్సర్ నిపుణుడు రఘురాం, ఎల్లా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చిత్రం.. మంగళవారం హైదరాబాద్‌లో ‘అలుపెరగని గళం- విరామమెరుగుని పయనం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్రా టల అసెంబ్లీ స్పీకర్లు కోడెల, మధుసూదనాచారి