తెలంగాణ

శంషాబాద్‌లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు సందర్శకుల పాస్‌లను కూడా రద్దు చేస్తున్నట్టు విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారుల ఆదేశాల మేరకు సాయుధ బలగాలను మోహరించారు. విమానాశ్రయం లోపలికి వచ్చే రెండు ప్రధాన రహదారులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్లాట్ ఫారాల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే రహదారులపై సైతం గట్టి నిఘా వేసి ఉంచామని, అడుగడుగునా వాహనాల తనిఖీలు చేపట్టామని, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే..విమానాశ్రయం సిబ్బందికి గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని విమానాశ్రయం అధికారులు సూచించారు. ప్రయాణికులతోపాటు విమానాశ్రయ వద్దగల క్యాబ్, టాక్సీ, ఇతర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రయాణికుల భద్రతతోపాటు విమానాశ్రయం సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

చిత్రం.. శంషాబాద్ ఎయర్‌పోర్టులో గస్తీలో ఉన్న స్పెషల్ పోలీసులు