తెలంగాణ

13 జిల్లాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 8: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 375 కోట్ల రూపాయలతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, 2 కమిషనరేట్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాలు, పోలీస్ నివాస గృహాల నిర్మాణం పనులకు నిధులు మంజూరు కాగా ఆ పనులకు తొందరలోనే టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. 30 కోట్ల రూపాయలతో సిద్ధిపేట, రామగుండం కొత్త కమిషనరేట్ల భవనాల నిర్మాణం, సిరిసిల్ల, మెదక్, నిర్మల్ ఎస్పీ కార్యాలయాల ఆధునీకరణ, రూ.75 కోట్లతో ములుగు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ భవన నిర్మాణం, రూ.30 కోట్లతో గజ్వేల్ ఫారెస్ట్ భవన నిర్మాణం, రూ.1.5 కోట్లతో రామగుండం కమిషనరేట్ పరిధిలో అంతర్గాం, రామగిరి పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. అబ్కారీ శాఖలో 9 పోలీస్ స్టేషన్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, అగ్నిమాపక దళానికి సంబంధించి 137 అభివృద్ధి పనులకు రూ.23.15 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బెటాలియన్ల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు కాగా దీనిలో రూ.10 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. రూ.3కోట్ల సింగరేణి నిధులతో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషన్‌నుగా తీర్చిదిద్ధనున్నామని, రూ.93.7 కోట్లతో రాష్ట్రంలోని 116 చోట్ల పోలీస్ స్టేషన్ భవనాలు, క్వార్టర్లు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయని, వాటిలో రూ.43 కోట్లు కేటాయించామని చెప్పారు. అలాగే రూ.68 కోట్లతో గ్రేహౌండ్స్ దళాలకు సంబంధించిన పనులను చేపట్టామని, వాటిలో 9 పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. పోలీస్ క మిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో పోలీస్ వ్యవస్థను రామగుండం కమిషనరేట్ పరిధిలో పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పరిధిలోని గోదావరిఖని-1, 2, మంథని, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, నస్పూర్, చెన్నూర్ పోలీస్ స్టేషన్లలో 5 ఎస్ సిస్టమ్‌ను అమలు చేయబోతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఈ మధ్యనే శిక్షణ కూడా పొందినట్లు చెబుతూ కార్సి చర్చ్ విధానం ద్వారా విధుల అప్పగింత చేపట్టనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి విజేందర్ రెడ్డి, గోదావరిఖని ఎసిపి అపూర్వరావుతోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.