తెలంగాణ

ట్విన్ టవర్లపై హైకోర్టు స్టే ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: రాజధానిలోని బంజరాహిల్స్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ జంట టవర్ల నిర్మాణంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ధర్మాసనం బెంచ్ ఎత్తివేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ 1982లోనే పోలీసు శాఖకు రాష్ట్రప్రభుత్వం భూమిని బదలాయించిందన్నారు. జంట టవర్లు నిర్మితమవుతున్న 8 ఎకరాల స్ధలంలో ఐదు ఎకరాలు తమదే నంటూ అఫ్సర్ అలీ మరో 16 మంది హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి కోర్టు స్టే మంజూరు చేసింది. వెంటనే రాష్ట్రప్రభుత్వం ధర్మాసనం వద్ద అపీల్‌కు వెళ్లింది. ఈ రోజు వాదనలు విన్న తర్వాత హైకోర్టు స్టే కొట్టివేసింది. పిటిషనర్లు కూడా పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోర్టుకు తెలిపారు.