తెలంగాణ

వడదెబ్బతో 15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/వరంగల్/నల్లగొండ/మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9: ఎండల తీవ్రత అధికం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బ తీవ్రత కారణంగా 15 మంది మరణించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన పాయిరాల కొండెల్లయ్య (40), మహా దేవపూర్ మండల కేంద్రానికి చెందిన తిరుకచ్చి రఘునాధ స్వామి (85), భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణికుంట స్వరూప (26) అనే కూలీ వడదెబ్బకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. అనే వ్యక్తి శనివారం వడదెబ్బతో చనిపోయారు. నల్లగొండ జిల్లాలో శనివారం ఒక్క రోజునే ఆరుగురు వడదెబ్బకు గురై మృతి చెం దారు. మిర్యాలగూడలో రిక్షా కార్మికుడు పిట్టల ఆనంద్ (48), వేములపల్లి మండలం కల్వలపల్లిలో నోముల శైలజ (25), మఠంపల్లి మండలం చెన్నాయ్‌పాలెంలో బూక్యా అమర్‌సింగ్ (65), చిలుకూరు మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీలు ముదిగొండ తిరుపయ్య (51), నూకపంగు బుచ్చయ్య (45) వడదెబ్బతో మృతి చెందారు. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామంలో పోతరాజు వెంకటమ్మ (45), చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన దేశపాక జానయ్య (31), వడదెబ్బతో మృతి చెందారు. మహబూ బ్‌నగ ర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని ముసాపేట గ్రామానికి చెందిన తిరుపతయ్య (42) అనే వ్యక్తి, పెబ్బేరు మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన బోయ శేషమ్మ (63) వడదెబ్బకు గురై మృతి చెందారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణం మాదారం కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ పసుల సమ్మ య్య(65), గణపురం మండలం కర్కకపల్లిలో వ్యవసాయ కూలీ రాజలింగు (65), కురవి మండల కేంద్రంలో తేనె వెంకన్న (44) అనే వ్యక్తి వడ దెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై శనివారం మృతి చెందారు.
రైతు ఆత్మహత్య
మిరుదొడ్డి, ఏప్రిల్ 9; మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో శనివారం అప్పుల బాధతో పంజా సత్తయ్య (45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వేసిన పంట కళ్ల ముందే ఎండిపోవడంతో నెల రోజుల క్రితం బోరు వేయడంతో నీరు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం వ్యవ సాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.