తెలంగాణ

కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 27: ‘ఊరికే కాంగ్రెస్‌పై నిందలు వేయడం కాదు.. మీకు నిజాయితీ, దమ్ము, ధైర్యముంటే 2014 కంటే ముందు, ఆ తరువాత రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ టిఆర్‌ఎస్ మంత్రులు, నాయకులకు సవాల్ విసిరారు. ‘మీరో ఐదుగురు ఇంజనీర్లను తెచ్చుకోండి, మేము ఐదుగురిని తెచ్చుకుంటాం, ఎవరెన్ని ప్రాజెక్టులు చేపట్టారో తేల్చుకుందాం.. చర్చకు సిద్ధమైతే ప్రకటించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ మీ తాత కట్ట్టాడా ? ఎల్‌ఎండి మీ నాయనా కట్టాడా? అంటూ మండిపడ్డారు. వరద కాలువను పూర్తి చేశామని, మిడ్ మానేర్‌ను 80 శాతం, ఎల్లంపల్లిని 90 శాతం పూర్తి చేశామని, ఇవేకాక రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించామని, ఇవీ మీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. 90 శాతం పూర్తయిన ఎల్లంపల్లి, 80 శాతం పూర్తయిన మిడ్‌మానేర్‌పై అరకొర పనులు చేస్తే, దానిపై కోట్లాది రూపాయల ఖర్చు చేస్తూ హంగామా చేస్తున్నారే తప్ప మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించారో చెప్పాలని నిలదీశారు. మహారాష్టత్రో ఒప్పందం చేసుకుని మేడిగడ్డ వద్ద 2016 మే 1న సిఎం కెసిఆర్ కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారని, రెండేళ్లల్లో కాళేశ్వరం నీటిని అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ అనుమతుల పేరిట ప్రజాభిప్రాయ సేకరణ అంటూ 17 జిల్లాలో చర్చ చేపడితే, అక్కడక్కడ కాంగ్రెస్ ఈ విధానం సరిగాలేదని నిలదీస్తే కాంగ్రెసోళ్లు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారంటూ నిందలు వేస్తూ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని విమర్శించారు. అంటే పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారా? పనులు ఎలా కొనసాగిస్తున్నారు? అంటూ నిలదీశారు. తప్పులు మీరు చేస్తూ కాంగ్రెసోళ్లపై నిందలు వేస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే బట్టలు ఊడదీసి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు. సిఎం కెసిఆర్ జిఎస్టీపై కోర్టుకెళ్లవచ్చుకానీ.. కడుపుమండిన రైతు మాత్రం కోర్టుకెళ్లవద్దు, ఇదేమి నీతి కెసిఆర్ అంటూ ప్రశ్నించారు. మూడేళ్ళైనా ఆర్టీసి, హైకోర్టు, ఉద్యోగుల విభజన జరగలేదని, వాటిని పరిష్కరించుకునే సత్తా లేని ప్రభుత్వం, మంత్రులు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌కు రైతు అవార్డు ఇవ్వడం ఓ బోగస్, దానికి గవర్నర్ ప్రశంస.. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి అని దుయ్యబట్టారు. ఇకపోతే కెసిఆర్ కరీంనగర్‌లో ప్రకటించిన విధంగా వైద్య కళాశాల కావాలా? వద్దా అనే దానిపై మంగళవారం జరిగే కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు. ఈ మేరకు జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, జడ్పీటిసిలు, ఎంపిపిలకు లేఖ రాయనున్నట్లు ప్రభాకర్ తెలిపారు.