తెలంగాణ

మృత్యు ‘మత్తు’లో యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాణాంతకమైన డ్రగ్స్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అత్యధికంగా మహరాష్టల్రో మాదకద్రవ్యాల మరణాలు సంభవిస్తుండగా, ఐదో స్థానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో(ఎన్‌సిఆర్‌బి)లో వెల్లడైంది. కాగా, ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తున్న డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కొటిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. డ్రగ్స్ మాఫియాపై ఆరా తీస్తున్నాయి. ఇటీవల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాదకద్రవ్యాల పెడ్లర్లు, వినియోగదారులపై దాడులు నిర్వహించి 27 మందిని విచారించి 11 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పెడ్లర్స్‌పై నిఘా ముమ్మరం చేసి నగరానికి చెందిన డ్రగ్ పెడ్లర్స్ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అధ్యక్షతన ఇటీవల 9ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమై డ్రగ్స్ మాఫియాపై తీసుకోవాల్సిన చర్యలు, డ్రగ్స్ నివారణ, క్రయ,విక్రయాలు, సరఫరా విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి వంటి అంశాలపై చర్చించారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కొటిక్స్, పోలీస్ వ్యవస్థలు డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో కార్యాచరణ రూపొందించింది. డ్రగ్స్ రహిత రాష్టమ్రే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కొటిక్స్ అధికారులు పనిచేస్తున్నట్టు సమాచారం. మహరాష్టల్రో 2014లో 1,372 మంది మృతి చెందగా, 2015లో 1,270 మంది మాదకద్రవ్యాలకు బానిసలై మృతి చెందారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 262 మంది డ్రగ్స్ కాటుకు బలి కాగా, తెలంగాణలో ముగ్గురు మహిళలు సహ 100 మంది మాదకద్రవ్యాలకు అలవాటుపడి ప్రాణాంతక వ్యాధులతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు మహిళలు సహ 162 మంది మృతి చెందినట్టు ఎన్‌సిఆర్‌బి రికార్డులు వెల్లడించాయి. మాదకద్రవ్యాలకు అలవాటుపడి, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడ్డవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
డ్రగ్స్ మత్తులో రాష్ డ్రైవింగ్‌తో ప్రమాద మృతులు, ప్రాణాంతక వ్యాధులతో ఆత్మహత్యలు వంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. 2015లో 690 కేసులు నమోదు కాగా, 2016లో 1,040 కేసు లు నమోదయ్యాయి. 2017లో 400 కేసులు నమోదైనట్టు ఎస్‌సిఆర్‌బి వెల్లడించింది. ఒడిశా, మధ్యప్రదేశ్, ముంబయి, బెంగుళూరులలో కొకైన్, బ్రౌన్ షుగర్ వాడకం కేసులు ఎక్కుగానే నమోదైనట్టు ఎన్‌ఆర్‌సిబి రికార్డులు చెబుతున్నాయి.