తెలంగాణ

నిన్నటి వరకు ప్రాణస్నేహితులు..ఒక్కటిగా వెళ్లిపోయారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఆగస్టు 27: ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు. ఏమైందో ఏ కష్టం వచ్చిందో తెలియదు. ఇద్దరు కలిసే తనువు చాలించారు. బాబుసాయిపేట గ్రామానికి చెందిన బచ్చు చరణ్ (19), బూరుగు నాగరాజు(20) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలోని టీక్యాతండా వద్ద రైలు పట్టాలపై శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై విగత జీవులుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించగా మృతులు త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామానికి చెందిన బూరుగు నాగరాజు, చరణ్‌లుగా గుర్తించి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. చరణ్‌కు తండ్రి లేకపోవడంతో తల్లి రేణుకతో కలిసి ఉంటున్నాడు. అంజయ్య, అరుణ దంపతుల కుమారుడు నాగరాజు త్రిపురారంలో మోటార్‌సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తుండగా చరణ్ మొబైల్ షాపులో పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి శనివారం మిర్యాలగూడ పట్టణానికి వెళ్లి తిరిగి రాకపోవడం తో వారి బంధువులు రాత్రిపూట గాలించినా ఆచూ కీ తెలియకపోగా, ఫోన్లు పనిచేయకపోవడంతో వెంటనే మిస్సింగ్ కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారు జామున యువకులకు రైల్వే పోలీసుల నుండి సమాచారం రావడంతో మృతుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రైల్వే నల్లగొండ ఎస్‌ఐ అచ్యుతం, కాంతారావు, నాగరాజు శవపంచనామా నిర్వహించి మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. చరణ్ తల వేరై చిందరవందరంగా పడి ఉంది. నాగరాజు మాత్రం గాయాలతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.
బెట్టింగే కారణమా?
రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న చరణ్, నాగరాజు మృతికి క్రికెట్, ప్రోకబడ్డీ బెట్టింగే బలితీసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. బెట్టింగ్ అలవాటు ఉన్న ఆ ఇద్దరు యువకులు ఆర్థికపరమైన ఇబ్బందుల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. చేతికొచ్చిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
విషాదఛాయలు
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో మృతదేహాలను తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్నటివరకు సజీవంగా కనిపించి. నేడు ఆనవాళ్లు లేకుండా ఛిద్రం కావడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్రలో గ్రామం కిక్కిరిసిపోయింది. ఎవరిని కదిలించినా కన్నీరే వస్తోంది.
స్నేహితులకు నివాళి
గాలికి గమ్యంలేదు, ప్రేమకు పుట్టుక తెలియదు, గుండెకు ఉండదు, స్నేహానికి మరిచిపోవడం తెలియదు, నిన్నటి వరకు బాబుసాయిపేట స్నేహితులు హృదయాలతో నివాళులర్పించారు.