తెలంగాణ

‘అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ‘అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ (తెలంగాణ అగైనస్ట్ కరప్షన్ టిఏసి)’ పేరుతో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ టిజెఏసి చైర్మన్ ప్రొ.కోదండరామ్, హైకోర్టు న్యాయవాది, 1969 తెలంగాణ ఉద్యమ నేత కె.చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయుడు జహీరుద్దీన్ అలీ ఖాన్, రచయిత, పాత్రికేయుడు కింగ్‌షుక్‌నాగ్‌లు సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతికరేక విధానాలపై ఎలుగెత్తి చాటేందుకు గాను ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్‌ను స్ధాపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా పోయిందని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రతిపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం నడుచుకుంటోందని అన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకని తాము రాజకీయేతర గ్రూప్‌గా ఏర్పడి తెలంగాణ అగైనస్ట్ కరప్షన్ టిఏసి పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు, విజ్ఞప్తులపై ప్రజా కోర్టుల ద్వారా పరిశీలించి ఆ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వెలుగులోకి తెస్తామని వివరించారు. మియాపూర్ భూ కుంభకోణం వంటి పెద్ద అంశాలు మొదలుకుని గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని వారు వివరించారు.