తెలంగాణ

30నుండి చేప పిల్లల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగు పరిచి వారిని సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈనెల 30 నుండి చేప పిల్లల విడుదల ప్రారంభించనున్నట్టు చెప్పారు. సింగూర్ జలాశయం నుంచి ప్రారంభిస్తారు. సచివాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14లక్షల 76వేల, 573గొర్రెలను పంపిణీ చేసినట్టు చెప్పారు. త్వరలోనే వంద సంచార పశు వైద్య వాహనాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 52కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 70కోట్ల చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 జలాశయాల్లో 4647 మత్స్య శాఖ చెరువులు, 20,391 గ్రామ పంచాయితీ కుంటలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. చేప పిల్లల పంపిణీలో మత్స్యశాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ గ్రామ స్థాయి అధికారులను భాగస్వాములను చేయడం జరిగినట్టు చెప్పారు. జిల్లాలోని జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని కొనుగోలు కమిటీల ద్వారా ఈ- ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలిచి చేప పిల్లల కొనుగోలు ధరలు నిర్ణయించినట్టు చెప్పారు. చేప పిల్లలను లెక్కించడానికి బెల్జియం దేశం నుండి యంత్రాన్ని తెప్పించినట్టు మంత్రి చెప్పారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఈ పథకం వల్ల మత్స్యకారులైన గంగపుత్రులు, బెస్త, ముదిరాజ్ కులాలకు ఆదాయం పెరిగి వారికి జీవనోపాధి కలుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా పెరిగి వినియోగదారులకు ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నీరు నిల్వ ఉండే చెరువులకు చేప పిల్లల పంపిణీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. ఆ చెరువుల్లో 35 నుండి 40 మిల్లీ మీటర్లు గల కట్ల, రోహు, బంగారు తీగ చేప పిల్లలు పంపిణీ చేస్తారు. సంవత్సరం పొడవునా నీరు ఉండే చెరువులు, జలాశయాలకు 80 నుండి 100 మిల్లీ మీటర్ల సైజు గల కట్ల, రోహు, మ్రిగాల చేప పిల్లలను నేరుగా చెరువు వద్దకే పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో 2017-18లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్టు తలసాని తెలిపారు.