తెలంగాణ

జిల్లా పోలీసింగ్ ఆధునీకరణకు 150 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: పోలీస్ శాఖ ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేసింది. జిల్లా పోలీస్ కమిషనరేట్లలో నూతన టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సీసీటివిల ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పోలీస్ ఉన్నతాధికారులు సైబర్‌ల్యాబ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టు తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆధునీకరణలో భాగంగా రూ. 150 కోట్లు కేటాయించగా, ప్రతి జిల్లా, కమిషనరేట్‌కు రూ. 3 కోట్ల చొప్పున విడుదల చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైమ్‌ను నియంత్రించేందుకు ప్రతి జిల్లా పోలీస్, కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ విభాగం, దానికి అనుసంధానంగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అక్కడి నుంచే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అదేవిధంగా మరో వంద కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఉపయోగిస్తున్న సెక్యూరిటీ యాప్స్‌ను జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. సంచలనాత్మకంగా మారే కేసుల్లో కీలక ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలకం కావడంతో రీజియన్ల వారీగా ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలకు మొదటి దశలో భాగంగా రూ. 150 కోట్లు కేటాయించగా, మరోదఫాలో రూ. 100 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.