తెలంగాణ

బిసి కులాల పునర్ వర్గీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28:బిసి కులాను పునర్ వర్గీకరించాలని రాష్ట్ర బిసి కమీషన్ నిర్ణయించింది. దీని కోసం మేధావులు, సామాజిక పరిశోధనా సంస్థలతో సమావేశం నిర్వహించింది. బిసి కులాల జాబితా వర్గీకరణ, సంచార కులాలు, ఎంబిసిల గుర్తింపు, నొమాడిక్, సెమి నొమాడిక్ విముక్తి జాతులపై సమగ్ర అధ్యయనంలో భాగంగా బిసి కమీషన్ సోమవారం సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, డాక్టర్ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్, పలు సామాజిక పరిశోధనా సంస్తల అధిపతులు, సామాజిక, ఆర్థిక ఆంత్రోపాలజీ, పలు విశ్వవిద్యాలయాల ఆచార్యులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న బిసి జాబితాలో ఉన్న కులాలలో అత్యంత వెనుకబడిన వర్గాలను, సంచాల కులాలపై చర్చించారు. జాతీయ స్థాయిలోని కాకా కాలెల్కర్, మండల్ కమిషన్ నివేదికలు, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పలు నివేదికలపై చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో బిసిల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ప్రస్తుతం అమలులో ఉన్న బిసి కులాల జాబితాను పునర్ వర్గీకరణ కోసం కావలసిన కార్యాచరణపై చర్చించారు.