తెలంగాణ

భారత్‌తో చైనా దొబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: భారత్‌తో చైనా డోక్లాం విషయంలో దోబూచులాడుతోందని తెలంగాణ రాష్ట్ర భజరంగ్‌దళ్ కన్వీనర్ భానుప్రకాష్ ఆరోపించారు. చైనా వ్యవహారాలు చూస్తుంటే భారత్‌కు భవిష్యత్ శత్రువులా కనిపిస్తోందని, టెర్రర్ కార్యకలాపాల్లో చైనా పాక్‌కు సహకరిస్తున్నట్టు ఆ దేశ చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోందని పేర్కొన్నారు. చైనా బహిరంగంగా యుద్ధ సవాళ్లు చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు తగిన బుద్ధి చెప్పాలంటే చైనా ఉత్పత్తులను మనం బహిష్కరించాలని, తద్వారా దిగుమతులు తగ్గి చైనా ఆర్ధిక మూలాలకు దెబ్బపడుతుందని అన్నారు. భారత సరిహద్దును కాపాడేందుకు సైనికులు అహరహం కష్టపడుతున్నారని, వారికి మానసిక బాసటగా నిలిచేందుకు చైనా సరకులు అమ్మే దుకాణాల ముందు సెప్టెంబర్ 1న నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు.