తెలంగాణ

పేద బాలుడికి సిఎం ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం ఉన్న పేద బాలుడికి సిఎం కెసిఆర్ రూ.25 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి సిఎం కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన హనుమాన్‌దాస్ కుమారుడు దేవసాని శ్రీమాన్‌కి 11 నెలల వయస్సు. పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్ష చేయించగా కాలేయానికి సంబంధించిన సమస్య తలెత్తిందని, కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించడంతో ఆందోళన చెందిన హనుమాన్‌దాస్ పత్రికలకు తన ఆవేదన చెప్పుకున్నాడు. ఆ కథనాలను చూసిన సిఎం కెసిఆర్ వెంటనే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడి అవసరమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆ కుటుంబాన్ని కలిసి సిఎం చెప్పిన సంగతి వివరించారు. ఇందుకు సంబంధించిన రూ.25 లక్షల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు కలెక్టర్‌కు అప్పగించారు. గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్న డాక్టర్లను కలెక్టర్ కలిసి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

చిత్రం..బాలుడి తల్లిదండ్రులకు చెక్కును అందిస్తున్న కలెక్టర్‌