తెలంగాణ

గిరిజన సంక్షేమంపై రేపటి నుండి జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: గిరిజన సంక్షేమ పథకాలు, పథకాల అమలుపై పరిశోధన, వినూత్న కార్యక్రమాలు అనే అంశంపై జాతీయ సదస్సును వర్శిటీ ఆడిటోరియం హాలులో ఈ నెల 29 నుండి నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి అప్పారావు సోమవారం నాడు చెప్పారు. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సిఐపిఎస్) , గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిపార్టుమెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ కలిసి ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ సదస్సును ఏపి మంత్రి ఆనందబాబు ప్రారంభిస్తారని, ఒడిస్సా మాజీ సిఎం గిరిధర్ గోమంగో, సిఐపిఎస్ డైరెక్టర్ డాక్టర్ నివేదిత పి హరన్, సదస్సులో ఆస్కి చైర్మన్ పద్మనాభయ్య, ముఖ్యకార్యదర్శి రాం ప్రకాశ్ సిసోడియా,స్పెషల్ కమిషనర్ పద్మ, సిఐపిఎస్ అదనపు డైరెక్టర్ అచలేందర్‌రావు, డీన్ ప్రొఫెసర్ వెంకటరావు, ఆస్కి డైరెక్టర్ జనరల్ రాజన్ హబీబ్ ఖజా పాల్గొంటారని అన్నారు. గిరిజనులకు అమలుచేస్తున్న పథకాలు అందుతున్న తీరు, లోటుపాట్లు, వాటిని సరిచేసుకునేందుకు తగిన సూచనలపై వక్తలు మాట్లాడతారని అన్నారు.