తెలంగాణ

విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 28: పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామంలో పశువుల క్రయ విక్రయాల సంతను, ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలోని దాసుగడ్డ తండ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా విద్యార్థుల అవసరం ఈ పాలిటెక్నిక్ కళాశాల తీరుస్తుందన్నారు. అదే విధంగా అన్ని సబ్జెక్టులకు కాంట్రాక్ట్ లెక్చరర్‌లను నియమించినట్లు చెప్పారు.దాదాపు రూ.325 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాలలకు కొత్త భవనాలు నిర్మించామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం నుండి 98 శాతం విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ప్రైవేట్ కళాశాలల్లో 60 శాతం కూడా నిండలేదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యుల చొరవతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ యేడాది 50 వేల మంది విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. కళాశాలకు చాలా పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలకు ప్రహారిగోడ, అప్రోచ్ రోడ్డు, బాలికలకు వసతి గృహం లేదని, ఊరికి దూరంగా కళాశా ల ఉన్నందున, కళాశాల మొదటి అం తస్తు నిర్మాణాలకు దాదాపుగా 6నుండి 7 కోట్ల రూపాయ లు అదనం గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రధానం గా సిసి రోడ్డు, ప్రహారి గోడల నిర్మాణాలకు అం చనా ప్రతిపాదనలు పంపినట్లైతే పరిపాలన మంజూ రు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడు తూ పశువుల క్రయ విక్రయాలు నిర్వహించేందుకు రూ.75 లక్షల నిధులతోనూతన హంగులతో పశువులకు, రైతులకు వసతులను ఏర్పాటు చేసామన్నారు.

చిత్రం..ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో పాలిటెక్నిక్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి