తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్నూర, ఆగస్టు 28: చదువుకోవడం ఇష్టం లేదన్నా నన్ను ఈ కళాశాలలో ఎందుకు చేర్పించారు? దేవుడా నరకం అనుభవిస్తున్నా..కళాశాల నుంచి బయటకు వెళదామంటే కుటుంబ సమస్యలు..తమ్ముడిని బాగా చదివించండి..కానీ ఇలాంటి హాస్టల్‌లో వేయకండీ అంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరే విద్యార్థి బలవన్మరణానికి కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరణించిన విద్యార్థిని తల్లిదండ్రుల కథనం ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకురన్తి పట్టణానికి చెందిన అనకఅపల్లి రాజశేఖర్, అరవింద దంపతుల కూతురు సహస్ర (17) పదవ తరగతి వరకు కల్వకుర్తిలో చదువుకుంది. పదవ తరగతిలో పాఠశాల టాపర్‌గా నిలువడంతో ఉన్నత చదువుల కోసం 2016 సంవత్సరంలో రత్నపురి పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమాలో చేర్పించారు. కళాశాల వసతి గృహంలో సరియైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే మహిళా వార్డెన్ కూడా లేరు. రాత్రి సమయంలో ఒకే మంచంపై ఇద్దరు విద్యార్థుల చొప్పున ఇరుకుగా పడుకోవాల్సిన దుస్తితి. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన విద్యార్థిని సహస్ర అర్ధరాత్రి హాస్టల్ గదిలోని ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నివసిస్తున్న గదిలో ‘దేవుడా నరకం అనుభవిస్తున్నా..ఈ కాలేజీలో చదవడం వ్యర్థం’ అంటూ రాయడం విశేషం. మరణించడానికి ముందు రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
కళాశాల వద్ద ఉద్రిక్తత
రత్నపురి కళాశాల వసతి గృహంలో విద్యార్థిని సహస్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్థిని మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. జిన్నారం సిఐ శ్యామల వెంకటేశం, స్థానిక ఎస్‌ఐ రాజేశ్ నాయక్‌లు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో శాంతించారు. ఇదిలావుండగా ఐదు నెలల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కూడా కళాశాల భవనంపై నుంచి క్రిందకు దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలపాలైన ఆ విద్యార్థిని చికిత్సలు నిర్వహించడంతో నెమ్మదిగా కోలుకోవడం విశేషం. ఆ సంఘటనను కళాశాల విద్యార్థులు మరచిపోకముందే సహస్ర రూపంలో మరో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
నా కూతురు మృతికి యాజమాన్యమే కారణం
నా కూతురు మృతికి రత్నపురి కళాశాల యాజమాన్యమే కారణమని విద్యార్థి సహస్ర తండ్రి రాజశేఖర్ ఆరోపించారు. కళాశాలలో సీనియర్ వ్యిద్యార్థులు పెడుతున్న ఇబ్బందులు, అక్కడి వసతులపై కళాశాల ఏఓ బిక్షపతి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, దీంతో అమాయకురాలైన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని రాజశేఖర్ బోరున విలపించాడు.