తెలంగాణ

పిఎం, సిఎంలు స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 28: తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి నీటి విడుదల చేయించేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులతో కలిసి సాగర్ డ్యాంను ముట్టడించి సాగర్‌కు నీటి విడుదల చేయించడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు పరిధిలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 7లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా మారిపోగా, హైద్రాబాద్‌కు తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ సమస్యపై ఇటు తెలంగాణ, ఏపి సీఎంలు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు గాని, అటు ప్రధాని నరేంద్రమోదీగాని ఒక్క మాట మాట్లాడకపోవడం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పట్ల వారి నిర్లక్ష్య ధోరణిని చాటుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపుతూ పాత ప్రాజెక్టుల నిర్వహణ, ఆయకట్టు రైతాంగం అవసరాలను విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటాను సాధించడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని, రావాల్సిన వాటా జలాల సాధనతో పాటు నూతనంగా నదీ జలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అల్మట్టి, నారాయణపూర్‌ల నుండి తక్షణమే కృష్ణానీటిని విడుదల చేయించి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. లేనట్లయితే సిపిఎం ఈ ప్రాంతా రైతాంగాన్ని, రైతు కూలీలను, సాగర్ పరిధిలో జీవనోపాధి పొందుతున్న ఇతర వృత్తిదారులందరినీ ఏకం చేసి ప్రభుత్వాల మెడ లు వంచే రీతిలో భారీ ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ధర్నాలో సిపిఎం రాష్ట్ర కమి టీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లా కార్యదర్శులు పి.సుదర్శన్‌రావు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డిలు మాట్లాడుతు సాగ ర్ జలాశయానికి కృష్ణా నీటి విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.
అంతకుముందు భారీ ర్యాలీగా సిపిఎం శ్రేణులు, కార్యకర్తలు సాగర్ డ్యాంపై ధర్నా నిర్వహించడంతో పాటు లెఫ్ట్ ఎర్త్ డ్యాం నుండి దిగువకు సాగర్ నీటిలోకి దిగి నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు గేటు వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది. చివరకు మరో మార్గంలో సాగర్ జలాశయంలోకి దిగిన సిపిఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన తెలిపి ధర్నా ముగించారు.

చిత్రం..సాగర్‌కు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డ్యామ్‌ను ముట్టడించిన సిపిఎం కార్యకర్తలు