తెలంగాణ

కోటి ఎకరాల సాగే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 28: రైతుల పక్షపాతియైన కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కోట్లాది నిధులు వెచ్చించి, తెలంగాణలోని కోటి ఎకరాల సాగు కావడమే లక్ష్యంగా శరవేగంతో పనులు చేస్తున్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. 32కోట్లతో పూర్తి చేసిన ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, రాయపట్నం ఎత్తపోతల పథకాలను ప్రారంభించిన అనంతరం రాయపట్నం గోదావరి తీరాన బహిరంగ సభలో హరీష్‌రావు ప్రసంగిస్తూ, మేడిగడ్డ వద్ద 60వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోవడాన్ని గమనించిన కేసిఆర్, కాళేశ్వరం నుండి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ లోనికి ఎత్తిపోసే కార్యాచరణకు రూపకల్పన చేశారని, తమ శాఖ ద్వారా ఏడాదిలోగా పూర్తి చేసే చర్యలు కొంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎల్లంపల్లి ద్వారా ఎసారెస్పీకి తీసుకుపోవాలంటే గోదావరిపై 40వేల కోట్లతో 11బ్యారేజీలు, 12ఎత్తపోతల పథకాలను చేపట్టి, వందలాది అడుగుల ఎత్తుకు చేర్చాల్సి ఉంటుందని, అందుకే 1000కోట్లతో వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ నింపే నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాంగ్రెస్ హయాంలో ఒకసారి ఎల్లం పల్లి నింపే ప్రయత్నం చేయగా, కొట్టుకు పోయిన ఉదంతాన్ని గుర్తు చేశారు. పదేళ్ళ క్రితం చేపట్టిన పోలవరంతో పోలుస్తూ, అన్నారం, సుందిళ్ళ, మేడిచెర్వు పనుల శరవేగాన్ని ఆంధ్ర ప్రభుత్వ అధికారు లు, ఎమ్మెల్యేలు చూసి పోతున్నారని, 16మాసాలలో పూర్తి చేసి, ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నట్టు వివరించారు. మిడ్ మానేరు, గౌరవెల్లి, ఎల్లంపెల్లి, మంధని లిఫ్ట్‌ల ద్వారా రైతులకు వర్షం కోసం చూడాల్సిన పరిస్థితే రాదన్నారు. ఇక కరీంనగర్ మరో కోనసీమ కానున్నదని ధీమా వ్యక్తం చేశారు. చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారాలలో ఈ ప్రాంత రైతులు చేసిన విజ్ఞప్తుల దృష్ట్యా అవిశ్రాంత కృషి చేసి, సిఎం, హరీష్‌రావుల వెన్నుదన్నుతో నేటికి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసే సమయం వచ్చిందన్నారు. రోళ్ళవాగు ఆధునీకరణ సాకారం కావడం హర్షణీయమని, 8ఎత్తిపోతల పథకాలు పూర్తయితే ఈ ప్రాంత వాసులకు ప్రయోజనం కలుగగలదన్నారు.
రాష్ట్ర ఐడిసి చైర్మన్ శంకర్‌రెడ్డి, పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్, లక్సెట్టిపేట ఎమ్మెల్యే దివాకర్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ రావు, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ దేవమ్మ, జడ్పీటిసి రాజమణి, ఎంపిపిలు మమతారావు, శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి రాజేశ్, దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, సర్పంచ్‌లు తిరుపతి, శంకరయ్య, ఎంపిటిసిలు తిరుపతి, రాధ, పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..రాయపట్నం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రి హరీష్‌రావు