తెలంగాణ

బలిదానాలతోనే తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: ‘మిత్రమా కెసిఆర్ నీ దొంగ దీక్షను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించడంతో పాటు తెలంగాణ ఆకాంక్ష కోసం విద్యార్దులు, యవకుల బలిదానాలు ప్రజల పోరాటాలను చూసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం టిజెఎసి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలోగల అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో నీళ్లు, నియామకాలు, నిధులు, పాలమూరు ప్రాజెక్టును రక్షించాలంటూ మహాధర్నాకు అఖిలపక్ష నేతలు దిగా రు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహాధర్నాకు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫేసర్ హరగోపాల్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా మహాధర్నాలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెబుతుంటారని తాను ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తలొగ్గి, దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పడం అబద్దమన్నారు. ఆయన చెప్పే మాటల్లో మాత్రం ఒకటి నిజముందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని చెబుతున్న మాట మాత్రం వందకు వంద శాతం నిజమని అన్నారు. కానీ కెసిఆర్ దొంగ దీక్షను చూసి మాత్రం సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, ఈ విషయం కెసిఆర్‌కు కూడా తెలుసని, నిజం ఎక్కడ చెబితే తనను ప్రజలు విశ్వసించరనే భావనతోనే కెసిఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవించాలని, ఆయన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ పార్టీకి, కెసిఆర్‌కు రాజకీయంగా ప్రాణం పోసిన పాలమూరు జిల్లాకు ఆయన తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టిన మహానుభావుడు ఎక్కడ ఉండడని, ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ప్రజలు అధోగతి పాలవుతారని విమర్శించారు.
కెసిఆర్‌కు పతనం ప్రారంభమైందని, అది పాలమూరు జిల్లా నుండేనని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును రెండుగా విభజించి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ నుండి సాగునీటిని తీసుకుంటే మేలు జరుగుతుందని, పాలమూరు ప్రజలతో పాటు ఇంజనీర్లు, మేధావులు, ప్రతిపక్షాలు గొంతెత్తిమొత్తుకుంటుంటే ఆయనకు వినపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో ధర్నాలో ప్రసంగిస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి