తెలంగాణ

నకిలీ బ్యాంక్ గ్యారంటీ లెటర్ కేసులో ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: బ్యాంక్ రుణం కోసం గ్యారంటీ లెటర్ ఇస్తామంటూ ఓ కంపెనీ యాజమాన్యాన్ని మోసగించి ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని మిసెస్ క్యోరి ఒరెమిన్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డికి హర్యానాలోని గుర్‌గావ్ చెందిన గోవింద్ యశ్వంత్, సంజీవ్ కొఠారి పరిచయమయ్యారు. హర్యానాలోని అలెంజరీ లిమిటెడ్ సిఇఓగా పరిచయమైన వీరు శ్రీకాంత్ రెడ్డికి రూ. 6,66,60. 000లు బ్యాంక్ రుణం ఇప్పిస్తామని, అం దుకు తామే బ్యాంక్ గ్యారంటర్లమంటూ నకిలీ గ్యారంటీ లెటర్ ఇచ్చారు. వీరిద్దరు కోల్‌కతాకు చెందిన సుమిత్ అగర్వాల్ ద్వారా నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలను సమర్పించారు. అందుకు గాను శ్రీకాంత్ రెడ్డి ద్వారా రూ. 92 లక్షలు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న వీరు స్పందించకపోవడంతో 2012లో సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకోగా, సుమిత్ అగర్వాల్ తప్పించుకు తిరుగుతున్నారు. సమాచారం తెలుసుకున్న నేర పరిశోధన విభాగం పోలీసులు కోల్‌కతా వెళ్లి సుమిత్ అగర్వాల్‌ను అరెస్టు చేసినట్టు అదనపు డిసిపి తెలిపారు.