తెలంగాణ

ప్రభుత్వమే ‘విమోచన’ నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ విమోచనకు జరిగిన పోరు, దాని వెనుక తెలంగాణ పోరాట యోధుల కృషి , దాని ప్రాధాన్యతను ప్రజల్లో మరింత చర్చకు పెట్టి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా బిజెపి రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీ నుండి తెలంగాణ విమోచన యాత్రకు రూపకల్పన చేసింది. ఓట్ల రాజకీయంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు జంకుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే బిజెపి ఈ విమోచన యాత్రకు రూపకల్పన చేసిందని విమోచన కమిటీ చైర్మన్ ఎన్ శ్రీవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నాటి నిజాం దురాగతాలకు, రజాకర్ల ఆకృత్యాలకు, ప్రజల పోరాటాలకు, త్యాగాలకు సాక్షీభూతంగా నిలిచిన ప్రదేశాలను ఈ సందర్భంగా సందర్శిస్తామని చెప్పారు. ప్రపంచానికి తెలిసేలా అధికారిక విమోచన దినోత్సవం ఇక్కడి ప్రజల హక్కు, ప్రభుత్వాల బాధ్యత అని చాటి చెబుతామని ఆయన వివరించారు. పరకాల సహా నాటి నిజాం మూకల రాక్షసత్వానికి సాక్ష్యంగా నిలిచిన దేవుని సంకేస, ఎర్రుపాలెం, బైరాన్‌పల్లి, దాశరథి ఖిల్లా, గౌరెల్లి, అప్పంపల్లి ప్రాంతాలను సందర్శిస్తామని అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి అమరవీరుల పోరాటాలను, త్యాగాలను స్మరించుకోవాలని బిజెపి దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో బిజెపి నాయకుల నుండి కార్యకర్తల వరకూ వేలాది మంది జైలుపాలయ్యారని, పోలీసుల లాఠీ దెబ్బలకు గాయాలపాలయ్యారని అన్నారు. తెలంగాణ విమోచన యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి విడుదల చేశారు.