తెలంగాణ

విపక్షాలకు మైండ్ బ్లాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందని టిఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల పాపం టిడిపిదని, ముదిగొండ కాల్పుల పాపం కాంగ్రెస్‌దని ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ సర్వేలు, బోగస్ అవార్డులు అంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఉత్తమ్ గ్యాంగ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. గోదాముల నిర్మాణం, ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఏటా ఎనిమిది వేల రూపాయలను రైతులకు నగదు సహాయం చేయడం వంటి నిర్ణయాలను చూసిన తరువాతనే కెసిఆర్‌కు అవార్డు ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముదిగొండలో తొమ్మిది మందిని కాల్చి చంపారని, అదే విధంగా విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తే టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బషీర్‌బాగ్ వద్ద కాల్పులు జరిపారని, ఇప్పుడీ రెండు పార్టీలు కలిసి టిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నాయని ఎద్దెవా చేశారు.
పాలమూరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డు: శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు ప్రాజెక్టులకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు జైపాల్‌రెడ్డి, డికె అరుణ అడ్డంకిగా మారారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ నాయకులకు జిల్లా ప్రాజెక్టులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి పాలమూరు పట్టణానికి 14 రోజులకు ఒకసారి తాగునీటిని ఇచ్చిన ఘనత ఉందని అన్నారు.