తెలంగాణ

కార్పొరేట్ కాలేజీల్లో పెరిగిన ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంవత్సరం మొదలై రెండు నెలల వ్యవధిలోనే అపుడే దాదాపు పది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడటంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తలొగ్గడం వల్లనే ఇలా జరుగుతోందని, ఇటు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై అనవసరమైన పెంచుతున్నాయని, దాంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్న విద్యార్ధులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని ఎఐఎస్‌ఎఫ్, ఎబివిపి నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎఐఎస్‌ఎఫ్ మంగళవారం నాడు నిరసన తెలుపగా, ఎబివిపి బుధవారం రాష్టవ్య్రాప్త నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గత 10 రోజుల వ్యవధిలో ఒక కార్పొరేట్ కాలేజీలో యాజమాన్యం ఒత్తిడికి గురై ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప పేర్కొన్నారు. శ్రావ్య, అరుణ, నాగసాయి అనే ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని, దానికి తల్లిదండ్రుల ఒత్తిడే కారణమని యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థల్లో విద్యార్థుల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి , అధికారులు బాధ్యులైన వారిని అరెస్టుచేయకుండా నోరు మెదపడం లేదని అయ్యప్ప పేర్కొన్నారు.