తెలంగాణ

మంచినీటికి కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచినీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌కు, అక్కంపల్లి నుంచి నల్లగొండ జిల్లాకు మంగళవారం రాత్రి నుంచే నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. జంట నగరాల మంచినీటి సరఫరాపై ప్రగతి భవన్‌లో మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసి అక్కడి నుంచి ఉదయసముద్రం ద్వారా నల్లగొండ జిల్లాకు నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కృష్ణానదిలోకి ఈసారి వరద నీరు రాలేదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు ఇప్పటికే డెడ్ స్టోరేజి కంటే తక్కువ మట్టానికి చేరుకోవడంతో జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ పరిస్థితిలో కృష్ణానది నీటిపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచినీటి సరఫరాకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కొత్తగా రెండు రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. కాళేశ్వరం నుంచి ఒక రిజర్వాయర్‌కు, కృష్ణానీటితో మరో రిజర్వాయర్లను నింపాలన్నారు. ప్రస్తుతం మంచినీటి సరఫరాకు ఉపయోగిస్తున్న హిమాయత్‌సాగర్, గండిపేట చెరువుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆవీ నగర అవసరాలను తీర్చలేవన్నారు. కరువు వచ్చినా, నది జలాలు అందుబాటులో లేకపోయినా జంట నగరాల మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలుగకుండా త్వరగా రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.