తెలంగాణ

బాలలను స్వేచ్ఛవైపు నడిపించడమే లక్ష్యంగా భారత్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 29: దేశంలోని బాలబలికలను స్వేచ్చవైపు నడిపించడమే లక్ష్యంగా కోటి మందితో భారత్ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు నోబల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్ధి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. బాల,బాలికలపై లైంగిక వేదింపులు, చిన్నారుల అక్రమ రవాణపై యుద్దం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు, మతపెద్దలు, కార్పొరేట్ సంస్థలతో చర్చించామని తెలిపారు. భారత్‌యాత్ర సెప్టెంబర 11న కన్యాకుమారిలో ప్రారంభమై అక్టోబర్ 16న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్ర సెప్టెంబర్ 21న హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అవగాహన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
చిన్నారులపై లైంగిక వేదింపులు సిగ్గుచేటు
నానాటికి చిన్నారులపై లైంగిక వేదింపులు పెరిగిపోవడం ఎంతో సిగ్టుచేటని అన్నారు. పిల్లలకు ఇళ్లు, పాఠశాలలు, హాస్టళ్లు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాదిత కుటుంబాలకు దగ్గరివారే అకృత్యాలకు పాల్పడుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. అభం, శుభం తెలియని పిల్లలపై లైంగిక వేదింపులు సమాజానికి పట్టిన పీడ అని అన్నారు. గత సంవత్సరం 15వేల లైంగిక వేదింపుల కేసులు నమోదు అయిన కేవలం 4శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా ఆకృత్యాలకు గురైన బాదితులకు వైద్యసేవలు అందడం లేదని, మానసికంగా కృంగిపోతున్న వారిని అదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్దం చేయాలని కోరారు. వీటన్నింటిపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కైలాస్ సత్యర్ధి