తెలంగాణ

ఆర్టీసిలో ఎక్కడి ఆస్తులు అక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: ఒకటి రెండు ఆస్తులకు సంబంధించి అంశాలు తప్పితే ఆర్టీసిలో విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రంలోని ఆర్టీసికే చెందుతాయని చెప్పారు. సచివాలయంలో మంత్రి అధికారులతో ఆర్టీసిపై మంగళవారం సమీక్షించారు. మరో 1500 కొత్త బస్సులను హైదరాబాద్ నగరం కోసం ముఖ్యమంత్రిని కోరనున్నట్టు చెప్పారు. 96 డిపోల పరిధిలో ఏటా 480 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఆర్టీసి సేవలను మరింత విస్తరిస్తూనే నష్టాలను తగ్గించి లాభాల్లోకి తీసుకు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో రెండువేల కోట్ల రూపాయల సహాయం అందించడంతో సంస్థ పరిస్థితి మెరుగైందని చెప్పారు. గతంలో కొత్త బస్సులు కొనుగోలు చేసినట్టు అవి ఇంకా రావలసి ఉందని తెలిపారు. మినీ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో పోలిస్తే తెలంగాణ ఆర్టీసి పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. ప్రస్తుతం 27 డిపోలు లాభాల్లో ఉండగా, మరో 56 డిపోలు గిరిష్టంగా నష్టాలను తగ్గించాయని త్వరలో ఇవి లాభాల్లోకి వస్తాయని చెప్పారు. కరీంనగర్, రంగారెడ్డి రీజియన్‌లు లాభాల్లో ఉండగా మహబూబ్ నగర్, మెదక్ రీజియన్‌లలో నష్టాలు భారీగా ఉన్నాయని వీటిని తగ్గించాలని సూచించారు.
5.45 కెఎంపిఎల్‌తో కేవలం 0.07ప్రమాదాల రేషియోతో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నట్టు చెప్పారు. 1100 పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిధుల కోసం ముఖ్యమంత్రిని కలువనున్నట్టు చెప్పారు. మొత్తం 1500 బస్సులు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ముంభై తరహాలో మెట్రోతో ఆర్టీసి బస్సులను అనుసంధానం చేయనున్నట్టు, దీని కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు.

చిత్రం..మంగళవారం సచివాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి మహేందర్ రెడ్డి