తెలంగాణ

డెంగీతో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ జీడిమెట్ల, సెప్టెంబర్ 12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డెంగీ వ్యాధి విజృంబిస్తుంది. సూరారంలో ఓ విద్యార్థి డెంగీ వ్యాధితో మృతి చెందాడు. పదిహేను రోజుల్లోనే డెంగీ వ్యాధితో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం, దులిమిట్ట గ్రామానికి చెందిన బాల నర్సయ్య, లక్ష్మీ దంపతులు గత కొంత కాలంగా సుభాష్‌నగర్ డివిజన్ సూరారం, కృషి కాలనీలో నివాసముంటున్నారు. వీరికి కూతురు రమ్య, కొడుకు రాజశేఖర్ (12) సంతానం. స్థానికంగా ఉన్న సిఎంఆర్ పాఠశాలలో రాజశేఖర్ 8వ తరగతి చదువుతున్నాడు. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో స్థానికంగా ఉన్న వైద్యులతో చికిత్సలు చేయించారు. తగ్గకపోవడంతో రక్తపరీక్షలు చేయగా తెల్లరక్తకణాలు తగ్గుతున్నట్లు తేలింది. వెంటనే రాజశేఖర్‌ను నగరంలోని కార్పొరేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. రాజశేఖర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీరని కన్నీటి శోకంతో మునిగిపోయారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో నివాసముండే వేణుగోపాల్, మాధవి దంపతులు. మాధవికి జ్వరంతో రావడంతో సికింద్రాబాద్‌లోని శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈనెల 5న చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి డెంగీ జ్వరం వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కుత్బుల్లాపూర్‌లో డెంగీ మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాటపడుతున్నారు. ఆసుపత్రులన్ని రోగులతో కిటకిటలాడుతున్నాయి. విష వ్యాధులైన డెంగీ, టైఫాయిడ్, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.