తెలంగాణ

వివరాలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళనా కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు గ్రామాల వారిగా తమ శాఖల పరిధిలోని భూ వివరాలను రెవిన్యూ రికార్డుల్లో చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం శాఖాధిపతులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా తమ శాఖల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు తయారు చేసి కలెక్టర్లకు అందజేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ ఆస్తుల వివరాలు రెవిన్యూ రికార్డులలో ఉండాలన్నారు. ప్రైవేట్ భూములు తప్ప ప్రస్తుతం ప్రభుత్వ భూముల వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా జిల్లాలు,గ్రామాల వారీగా సర్వే నంబర్ల ప్రకారం ప్రభుత్వ ఆస్తులు నమోదు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, నేషనల్ హైవే, టెలికమ్, పవర్ గ్రిడ్‌ల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు కూడా రికార్డు చేయాలన్నారు. చాలా మటుకు శ్మశాన వాటికల పేర్లు ఇప్పటికీ రైతుల పేర్లపైనే ఉన్నాయని, వీటిని కూడా సరిచేయాలన్నారు. పాఠశాలలు, మార్కెట్ యార్డులు, గోదాములు, రోడ్ల వంటి వివరాలు నమోదు చేయాలన్నారు.