తెలంగాణ

డిసెంబర్ 28వరకూ ‘ఇందిరమ్మ రైతు బాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలకు, రైతులకు చేరువయ్యేందుకు డిసెంబర్ 28 వరకు ‘ఇందిరమ్మ రైతు బాట’ చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఆఫీస్ బేరర్లతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐసిసి ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సౌత్ ఇండియా కో-ఆర్డినేటర్ డాక్టర్ జె. గీతారెడ్డి, మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించేందుకు ధైర్యం చేయని పేదలకు, ప్రధానంగా బడుగు, బలహీనవర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమాల గురించి వివరించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 28 వరకు ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమాలను సుమారు వంద రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.రైతు సమన్వయ సంఘాల పేరిట గ్రామాలలో భూ సవరణలు, సభలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా ఏర్పాటు చేసే కమిటీలు పూర్తిగా టిఆర్‌ఎస్ కమిటీలుగా మారనున్నాయని ఆయన విమర్శించారు.
ఈ విషయాలపై గ్రామానికి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ రికార్డుల సవరణలు, భూ సర్వే, టిఆర్‌ఎస్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇండ్లు వంటి హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోకుండా కాలయాపన చేయడాన్ని ప్రజల్లో ఎండగట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.