తెలంగాణ

మెట్రో ‘లింకు’ షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ కారణంగా బండి బయటకు తీస్తే అడుగడుగున ట్రాఫిక్ గండంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మహానగరవాసులకు మెట్రోరైలు అందుబాటులోకి వచ్చేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. రెండు కారిడార్లలో సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆహార్నిశలు పనులు జరుగుతుండగా, మరోవైపు మెట్రోరైలు రాకపోకలను ప్రస్తుతమున్న ఆర్టీసి, ఎంఎంటిఎస్ ప్రజారవాణా వ్యవస్థకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. హైటెక్స్ కనె్వన్షన్ సెంటర్‌లో ట్రాఫిక్ ఇంఫ్రాటెక్ సంస్థ నిర్వహించిన ‘్ఫ్యచర్ మొబిలిటీ చాలెంజెస్, సొల్యూషన్స్’ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఇతర మెట్రోరైలు ప్రాజెక్టులతో పోల్చితే హైదరాబాద్ మెట్రోరైలు ఎంతో ఆధునికమైన ప్రజారవాణా వ్యవస్థ అని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ, అతి తక్కువ విద్యుత్ వినియోగం, ఒకే స్తంభంపై సమతుల్య కాంటీలివర్ పద్దతిలో నిర్మించిన స్టేషన్లు వంటివి ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మించినవిగా వివరించారు. ప్రజారవాణాలో స్మార్ట్ టికెటింగ్, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ ప్రయాణం వంటి సౌకర్యాల ప్రాముఖ్యతను వివరించారు. మెట్రో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు, హైదరాబాద్ నగర వ్యాపార సామర్థ్యాన్ని పెంచటానికి, మెట్రో వయోడక్ట్ కింద స్కై వాక్‌ల నిర్మాణాలు వంటి అంశాలపై మున్ముందు ఉండే ప్రభావాన్ని ఆయన వివరించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల ప్రకారం హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు నగర పునఃనిర్మాణానికి, సుందరీకరణ పనుల గురించి వివరించారు. రవాణా ఆధారిత అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ మెట్రో కారిడార్లకు ఇరువైపులా 300 మీటర్ల స్థలాన్ని రవాణా ఆధారిత అభివృద్ధి జోన్‌గా గుర్తించి మెట్రో మాల్స్‌ను నిర్మించేందుకు నిర్మాణ మినహాయింపులను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆధునాతనమైన పార్కింగ్ సౌకర్యాలను కూడా మెట్రో స్టేషన్లలో కల్పించినట్లు ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.