తెలంగాణ

నాడు నిర్వహించమన్నవారే నేడు మాట్లాడటం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దురవస్థలో ఉన్నామని చెప్పారు. పార్టీల పరంగా విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్న వారు అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదని చెప్పారు. నిజాం ఆగడాలను బట్టబయలు చేసిన త్యాగధనులను స్మరించుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రజాకార్లను ప్రోత్సహించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కీర్తించడం చూస్తుంటే ఎటువంటి సందేశం ఇవ్వదల్చుకున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. నేటి మంత్రులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారని, ఇపుడు వారు అధికారంలో ఉండి మాట్లాడటం లేదని చెప్పారు. తెలంగాణలో గత పక్షం రోజులుగా తాము నిర్వహించిన విమోచన యాత్ర విజయవంతం అయిందని లక్ష్మణ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలతో పాటు సుద్దాల అశోక్ తేజ తదితరులు మాట్లాడారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిజామాబాద్ సంకల్ప సభ పోస్టర్‌ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఓవర్సీస్ ఎన్‌ఆర్‌ఐ సదస్సును బిజెపి నిర్వహించింది.

చిత్రం..శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత కిషన్‌రెడ్డి