తెలంగాణ

బంగారు పోలీసు స్టేషన్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: బంగారు తెలంగాణ చేయాలన్న అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పోలీసులకు ఆధునిక వసతి సౌకర్యాలు కల్పిస్తూ, పోలీసు కార్యాలయాలను, పోలీస్ స్టేషన్లనూ బంగారు పోలీసు స్టేషన్లుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించారని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కొత్తగా 13 ఎస్‌పి కార్యాలయాల నిర్మాణానికి, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్ల నిర్మాణానికి, అన్ని పోలీసు స్టేషన్లనూ ఆధునీకరించేందుకు సిఎం రూ. 375 కోట్లు కేటాయించారని చైర్మన్ కోలేటి దామోదర్ శుక్రవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్కో కమిషనరేట్ కార్యాలయాన్ని రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాలకు రూ. 15 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నామని చెప్పారు. ఇదివరకే ఉన్న ఎస్‌పి కార్యాలయాలను, పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తామని, పోలీసు క్వార్టర్లకూ పూర్తిగా అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
దేశంలోనే నెంబర్-1
రామగుండం కమిషనరేట్ ఏర్పాటుతో పాటు గోదావరిఖనిలో దేశంలోనే ఆదర్శ పోలీసు స్టేషన్ నిర్మాణానికి సిఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన వివరించారు. గోదావరిఖనిలో రూ. నాలుగున్నర కోట్లతో అత్యంత ఆధునిక పద్ధతుల్లో పోలీసు స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, సింగరేణి కాలరీస్ యాజమాన్యం రూ. 3 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనందున ఇంకా 116 పోలీసు స్టేషన్ల భవనాలను, క్వార్టర్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ. 93.07 కోట్లు మంజూరు చేసిందన్నారు. దక్షిణ తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతోందన్న భావన ప్రజల్లో ఉందన్న వాదనను కోలేటి తోసిపుచ్చారు. మహబూబ్‌నగర్‌లోని అటవీ ప్రాంతంలో గల మన్ననూరులో రూ. రెండు కోట్లతో అత్యంత ఆధునికంగా పోలీస్ స్టేషన్‌ను నిర్మించడం జరిగిందని, దీనిని వారం రోజుల క్రితమే ప్రారంభించామన్నారు.
తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో సిఎం ఉన్నారని, ఏ ప్రాంతాన్ని, ఏ గ్రామాన్ని, ఏ ఒక్క వర్గాన్నీ, ఏ ఒక్కరినీ నిర్లక్ష్యం చేయరని, తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబంగా భావిస్తారని వివరించారు. ఇంకా అచ్చంపేట, నాగర్ కర్నూలు పోలీసు స్టేషన్ల నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని, ఖమ్మం, భద్రాచలం పోలీసు స్టేషన్లను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.
ఆదిలాబాద్, సిరిసిల్లలో కొత్తగా స్పెషల్ పోలీసు బెటాలియన్ల ఏర్పాటుకు నిర్మాణాలు చేపడతామని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. వివిధ జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజారు చేసిందని, అందులో మూడు పనులు రూ. 10 కోట్ల ఖర్చుతో పురోగతిలో ఉన్నాయని అన్నారు. గ్రేహౌండ్స్ దళాలకు సంబంధించి పనులకు ప్రభుత్వం రూ. 68 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జైళ్ళ శాఖకు సంబంధించిన 31 పనులకు రూ. 4.44 కోట్లు, అగ్నిమాపక దళానికి సంబంధించిన 137 పనులకు రూ. 23.15 కోట్లు, అబ్కారి శాఖకు సంబంధించిన 9 స్టేషన్ల భవనాల నిర్మాణాన్ని చేపట్టినట్లు కోలేటి దామోదర్ వివరించారు.