తెలంగాణ

ఇక్కడ పశువు లేదమ్మా..నేను ముఖ్యమంత్రిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సంచార పశువైద్యశాలలను శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సందర్భంగా సభా వేదికపై తమాషా ఘటన జరిగింది. రైతులకు టోల్‌ఫ్రీ నెంబర్ బాగా పనిచేస్తోందా? అందుబాటులో ఉందా? అని సిఎం అధికారులను ప్రశ్నించారు. వెంటనే అధికారులు ఆ నెంబరుకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి చేతికి అందించారు. ఎంత సేపట్లో మా వద్దకు రాగలుగుతారని సిఎం ప్రశ్నించారు. ‘మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్ ...’ అంటూ కాల్‌సెంటర్ వారు అడగడంతో సిఎం మాట్లాడుతూ ఇక్కడ పశువు లేదమ్మా...నేను సిఎంను ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం అని సమయస్ఫూర్తితో మాట్లాడి సభలో నవ్వులు పూయించారు.
సిఎం కెసిఆర్‌కు, కాల్ సెంటర్ వారి మధ్య సంభాషణ
కాల్ సెంటర్: నమస్తే పశు ఆరోగ్య సేవ 1962కు మేము ఏ విధంగా సహాయపడగలం సార్...చెప్పండి సార్...
సిఎం కెసిఆర్: మీరు ఏ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారమ్మా..?
కాల్ సెంటర్: చెప్పండి సార్
సిఎం కెసిఆర్: అమ్మా మీరు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపట్లో రాగలుగుతారు?
కాల్ సెంటర్: 30 నిమిషాల్లో రాగలుగుతాం...మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా? సార్
సిఎం కెసిఆర్: ఇక్కడ పశువు లేదమ్మా ..ఇది ప్రారంభోత్సవం...
కాల్ సెంటర్: ధన్యవాదాలు సార్..1962 నెంబర్‌కు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్..
సిఎం కెసిఆర్: కంగ్రాట్యులేషన్స్ గోహెడ్.. అంటూ సిఎం ఫోన్ పెట్టేశారు.